హైదరాబాద్, 13 జూలై (హి.స.) ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు అని అన్నారు. వారి మరణంతో సినీమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. స్వర్గస్తులైన కోట శ్రీనివాసరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్