పేదలకు ఉచిత వైద్యం అందినపుడే సమాజం పురోభివృద్ధి : ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
తెలంగాణ, నిర్మల్. 13 జూలై (హి.స.)పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందినప్పుడే సమాజం పురోభివృద్ధి చెందుతుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (బి) గ్రామంలో బైంసా డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర
ఎమ్మెల్యే పవార్ రామారావు


తెలంగాణ, నిర్మల్. 13 జూలై (హి.స.)పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందినప్పుడే సమాజం పురోభివృద్ధి చెందుతుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (బి) గ్రామంలో బైంసా డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానాటికి సమాజంలో పెరిగిపోతున్న రోగాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం వాటి నివారణకు శ్రమిస్తున్న వైద్యులు దైవసమానులని కొనియాడారు. ఇలాంటి మారుమూల గ్రామాలలో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యం అందించడంతో పాటు వారిలో మనోధైర్యాన్ని నింపుతున్న డాక్టర్లు అభినందనీయులని అన్నారు.

సమాజంలో వైద్యులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande