పాషమైలారంలో మరో పరిశ్రమలో అగ్నిప్రమాదం..
తెలంగాణ, సంగారెడ్డి. 13 జూలై (హి.స.) సంగారెడ్డి జిల్లా పటాన్చెరువ మండలం పాశమైలారంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పాశమైలారంలోని ఎన్పీరో వెస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. పరిశ్రమలో ఒక్క
అగ్ని ప్రమాదం


తెలంగాణ, సంగారెడ్డి. 13 జూలై (హి.స.) సంగారెడ్డి జిల్లా పటాన్చెరువ మండలం పాశమైలారంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పాశమైలారంలోని ఎన్పీరో వెస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో అక్కడి సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా లేదా అనే విషయం ఇంకా స్పష్టతకు రాలేదు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించిందన్న సమాచారం లేదు. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు పరిశ్రమల భద్రతాపరమైన చర్యలపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సంబంధిత అధికారులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande