హైదరాబాద్, 13 జూలై (హి.స.)
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కోట భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ తరుణంలో ఆయన విలక్షణ నటుడు, మానవతావది. శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కుమారుడి అకాల మరణంతో కోట బాగా కుంగిపోయారు. మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా' అని వెంకయ్యనాయుడు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..