తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి – గాలిలోకి కాల్పులు
హైదరాబాద్, 13 జూలై (హి.స.) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనై తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. ఈ సంఘటన హైదరాబాద్ మేడిపల్లిలోని మల్లన్న కార్యాలయంలో ఆదివారం చోటు
తీన్మార్ మల్లన్న


హైదరాబాద్, 13 జూలై (హి.స.)

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనై తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. ఈ సంఘటన హైదరాబాద్ మేడిపల్లిలోని మల్లన్న కార్యాలయంలో ఆదివారం చోటుచేసుకుంది. జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీసుకు చేరుకొని నినాదాలు చేస్తూ కార్యాలయ గేట్లు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకుపోయారు. కార్యాలయ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.

ఈ పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్నకు సెక్యూరిటీగా ఉన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇది మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. కాల్పుల శబ్దంతో సమీప ప్రాంత ప్రజల్లో కలవరం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కార్యాలయం వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దాడుల ఘటనలో మల్లన్న ఆఫీస్ కార్యాలయం రక్తసిక్తమైంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు తీన్మార్ మల్లన్న గన్మెన్ కాల్పుల అంశాన్నీ సమగ్రంగా పరిశీలిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande