హైదరాబాద్, 14 జూలై (హి.స.)
తెలంగాణ రాజధాని నగరం అయిన
హైదరాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ రోగిపై ఆసుపత్రి వార్డ్ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. ఈ షాకింగ్ ఘటన నగరంలోని విద్యానగర్ ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనారోగ్య సమస్యతో ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో ఓ మహిళ చికిత్స పొందుతుంది. మహిళా రోగి ఒంటరిగా ఉండటం గమనించిన వార్డు బాయ్ ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
దీంతో అప్రమత్తమైన మహిళ.. బిగ్గరగా అరుస్తు.. తనను కాపాడాలని కేకలు వేసింది. మహిళ అరుపులతో వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకొని.. వార్డు బాయ్ ను పట్టుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు అతన్ని చితకబాదారు. అనంతరం అతనిపై నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్