శ్రీమద్ భాగవతం షూటింగ్ ప్రారంభోత్సవం.. పాల్గొన్న సీఎం రేవంత్
హైదరాబాద్, 14 జూలై (హి.స.) హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో “శ్రీమద్ భాగవతం పార్ట్-1” చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎంతోపాటు శాసన మండలి
CM revanth


హైదరాబాద్, 14 జూలై (హి.స.)

హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో “శ్రీమద్ భాగవతం పార్ట్-1” చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎంతోపాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం చిత్రీకరణ జరగడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ.. దేశంలోనే యూనిక్ స్టూడియో అని చెప్పారు. రామాయణం, మహా భారతం, భాగవతం మన జీవితాల్లో భాగం అయిపోయాయని అన్నారు. ఇలాంటి గొప్ప కథను మరోసారి ప్రజలను అందించాలనే నిర్ణయం తీసుకున్న నిర్మాతలను అభినందించారు. తరం మారుతున్న సందర్భంగా దృశ్యకావ్యం తీయడం గొప్ప విషయం అని ప్రశంసించారు. 40 ఏళ్ల క్రితం టీవీల్లో రామాయణం సీరియల్ వస్తుందంటే.. బయట రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండేవని గుర్తుచేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande