మరింత బలోపేతం కానున్న చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు: ఎస్ జైశంకర్
హైదరాబాద్, 14 జూలై (హి.స.) భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం చైనా పర్యటనలో ఉన్నారు. ఐదేళ్ల తర్వాత మొదటిసారి చైనా పర్యటనకు వెళ్లిన జైశంకర్, బీజింగ్ లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్తో సమావేశం అయ్యారు. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతు
జయ శంకర్


హైదరాబాద్, 14 జూలై (హి.స.)

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం చైనా పర్యటనలో ఉన్నారు. ఐదేళ్ల తర్వాత మొదటిసారి చైనా పర్యటనకు వెళ్లిన జైశంకర్, బీజింగ్ లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్తో సమావేశం అయ్యారు. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం, రష్యాతో సంబంధాలున్న దేశాలపై 500 శాతం సుంకం విధిస్తామని అమెరికా హెచ్చరించిన ఈ నేపథ్యంలో చైనాతో భారత్ చర్చలకు సిద్ధమవడం చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా హాన్ జెంగ్తో సమావేశం ద్వారా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని, భవిష్యత్తులో మరింత బలోపేతం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

హాన్ జెంగ్తో జరిగిన సమావేశంలో, జైశంకర్ చైనా షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) అధ్యక్ష పదవికి భారత మద్దతును వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్సై పోస్ట్ చేసిన జైశంకర్.. ద్వైపాక్షిక సంబంధాలు బలపడనున్నాయి. తాను బీజింగ్కు వచ్చిన వెంటనే ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ను కలవటం సంతోషంగా ఉంది. చైనా ఎస్సీఓ అధ్యక్ష పదవికి భారత మద్దతును తెలియజేశాను. మా ద్వైపాక్షిక సంబంధాలలో మెరుగుదల కనిపించింది. ఈ పర్యటనతో జరిగే చర్చలు సానుకూల పథాన్ని కొనసాగిస్తాయని నమ్ముతున్నట్టు పోస్ట్లో పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande