హైదరాబాద్, 14 జూలై (హి.స.)
ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు ఈరోజు ఉదయం జాగృతి మహిళా నేతలు పెద్ద ఎత్తున మహిళా కమిషన్ చేరుకున్నారు. అయితే వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కమిషన్ అధికారులు అందుబాటులో లేరని చెప్పారు. దీంతో తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ జాగృతి మహిళా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదు తీసుకునేందుకు చైర్ పర్సన్ అందుబాటులో లేకపోవడంపై నిరసన తెలిపారు. మహిళా ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్