న్యూఢిల్లీ, 14 జూలై (హి.స.)
నేషనల్ హెలార్డ్ మనీ లాండరింగ్
కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలను మరింత చట్టపరమైన విచారణకు తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ (పీసీ యాక్ట్) విశాల్ గోగ్నే జులై 29న ప్రకటించనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్