హైదరాబాద్, 14 జూలై (హి.స.)
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇవాళ సోమవారం బీసీ నేత వట్టే జానయ్య విచారణకు హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేశారు. ఎన్నికలప్పుడు వట్టే జాన్యయ ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయనను సిట్ అధికారులు విచారణకు పిలవగా ఇవాళ ఇవాళ దర్యాప్తు అధికారులు ముందు హాజరైన వట్టే జానయ్య నుంచి అధికారులు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్