హైదరాబాద్, 14 జూలై (హి.స.) రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు ల
జారీ వేళ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ పెట్టారు. సన్నబియ్యంతో పల్లెల్లోని రేషన్ షాపుల వద్ద సందడి సంతరించుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసం పేదవాడి పదేళ్ల ఎదురు చూపులు నేడు ఫలించబోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు, 3.10 కోట్ల మందికి ఆహార భద్రత, ఒక్కొక్కరికి ఆరు కేజీల ఉచిత సన్నబియ్యం. ఇదీ పేదల సంక్షేమం పట్ల మా వజ్ర సంకల్పం' అని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..