కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రంలో అసంతృప్తి : బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు
తెలంగాణ, నల్గొండ. 14 జూలై (హి.స.) కాంగ్రెస్ కు అధికారం ఎందుకు ఇచ్చామా అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా చౌటుప్పల్ కు విచ్చేసిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం
బీజేపీ చీఫ్


తెలంగాణ, నల్గొండ. 14 జూలై (హి.స.)

కాంగ్రెస్ కు అధికారం ఎందుకు

ఇచ్చామా అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా చౌటుప్పల్ కు విచ్చేసిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సన్మానసభలో రామచందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి స్వర్ణయుగాన్ని తీసుకొచ్చే సత్తా బీజేపీకే ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. రైతులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, స్టూడెంట్స్ ఫీజు రీయంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ అవినీతిని మూటగట్టుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో మాత్రమే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande