హైదరాబాద్, 15 జూలై (హి.స.)
ఆదాయానికి మించి ఆస్తులు
ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఇవాళ ఏసీబీ అధికారులు నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) రిటైర్డ్ మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బంజారాహిల్స్లోని ఆయన నివాసంతో పాటు కరీంనగర్, జహీరాబాద్లలో మొత్తం 10 చోట్ల బంధువులు, స్నేహితుల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపడున్నారు. తనిఖీలపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..