తెలంగాణ, నాగర్ కర్నూల్. 15 జూలై (హి.స.)
నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలోని లింగసానిపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో ఇటీవల ప్రతిష్టించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం, సుమారు ఏడాది క్రితం ఓ ప్రజాప్రతినిధి విగ్రహాన్ని గ్రామానికి విరాళంగా అయితే ఇప్పటివరకు విగ్రహాన్ని అధికారికంగా ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు రాళ్లతో విగ్రహం చెయ్యిపై విరుచుకుపడి దాన్ని ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై గ్రామ యువకులు బిజినపల్లి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు