అమరావతి, 15 జూలై (హి.స.)
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ యువనేత మారెల్లి అనిల్ (35) అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. అతని కుడి భుజం నుంచి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో బుల్లెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. హత్య?.. ఆత్మహత్య? కోణంలో విచారణ చేపట్టినట్లు ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపారు. శవపరీక్ష కోసం అనిల్ మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ