తెలంగాణ, నిర్మల్. 15 జూలై (హి.స.)
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పొద్దు పొడుపు బొజ్జన్న అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం కడెం మండల కేంద్రంతో పాటు పెద్దూరు గ్రామంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి వారు ఎదురుకుంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగు పరుస్తామన్నారు. నాడు బీఆర్ఎస్ హయంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు.ప్రజా ప్రభుత్వం హయాంలో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. పింఛన్ రానీ వారికి త్వరలో పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు