మహబూబ్నగర్, 15 జూలై (హి.స.)
పాలమూరు జిల్లాలో ప్రైవేటు దవాఖానలు బంద్ పాటిస్తున్నాయి. వైద్యులపై దాడికి నిరసగా మంగళవారం ఓపీ సేవలతోపాటు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. సోమవారం రాత్రి మహబూబ్నగర్ పట్టణంలోని యునైటెడ్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చిన ఓ గిరిజన మహిళ మృతిచెందారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రైవేట్ హాస్పిటల్స్ అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్పై దాడి చేశారు. దీనికి నిరసనగా పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు హాస్పిటల్స్ను మూసివేయాలని, ఎలాంటి సేవలు అందించకూడని నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..