హైదరాబాద్, 15 జూలై (హి.స.)
తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేసేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ను వణికిస్తోంది. ఇప్పటికే ఎస్ఐబీ ఓఎస్డి కొడుకును అరెస్ట్ చేయగా, తాజాగా మంగళవారం సైబరాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ కుమారుడు మోహన్ను ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. కొంపల్లి మల్నాడు కిచెన్ యజమాని సూర్య అమ్మినేని డ్రగ్స్ వ్యవహారంలో సంచలన వెలుగు చూస్తున్నాయి. దొరికిన ఆధారాలతో ఆధారాలతో డీసీపీ కొడుకు మోహన్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. సూర్య అమ్మినేని డ్రగ్స్ వ్యవహారంలో ఈగిల్ చేస్తున్న దర్యాప్తుతో పోలీసు శాఖతో పాటు సెలబ్రిటీల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన నిందితుడు సూర్య అమ్మినేనితో పాటు అరెస్ట్ అయిన మరికొందరిని కస్టడీలోకి తీసుకున్నారు. వారి విచారణలో కొందరి ప్రముఖుల పేర్ల కూడా వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా అరెస్ట్ అయిన మోహన్ను కూడా విచారిస్తే అతడితో ఎంతమంది డ్రగ్స్ కోసం టచ్లో ఉన్నారనే విషయాన్ని ఈగిల్ టీమ్ బయటపెట్టనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్