జోగులాంబ గద్వాల: 15 జూలై (హి.స.) ప్రతినిధి జోగులాంబ
గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. మక్తల్ మండలం భూత్పూర్ గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సాయి శృతి ప్రమాదవశాత్తు పాఠశాల మొదటి అంతస్తు నుండి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్పందించిన పాఠశాల సిబ్బంది బాలికను తక్షణమే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆసుపత్రి సిబ్బందికి బాలికకు మెరుగైన వైద్యం కల్పించాలని సూచించారు.
పాఠశాల స్పెషల్ ఆఫీసర్ పద్మావతి మీడియాతో మాట్లాడుతూ, సాయి శృతి ఓ మంచి అమ్మాయి. కొన్ని రోజులుగా ఇంటి విషయాలతో మానసికంగా బాధపడుతూ మంగళవారం ఉదయం నీరసంతో కళ్ళు తిరిగి పైనుండి కిందపడిపోయినట్లు అనిపిస్తోంది, అని వివరించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్