హైదరాబాద్, 15 జూలై (హి.స.)
తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG POLYCET) కౌన్సెలింగ్ 2025-2026 విద్యా సంవత్సరానికి గాను మొదటి దశ సీట్ల కేటాయించారు. ఈ మేరకు సీట్లు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://tgpolycet.nic.in/Default.aspx అలాట్మెంట్ అర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థలకు సీట్లను అలాట్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన విద్యార్థులు నేటి నుంచే ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయవచ్చు. అందుకు జూలై 18 చివరి తేదీగా ప్రకటించారు.
పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. జూలై 24 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్