ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
అమరావతి, 15 జూలై (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా, తాజాగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్
ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్


అమరావతి, 15 జూలై (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా, తాజాగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

ఈ నెల 16 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పోస్టులకు దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande