తెలంగాణ వాదులు భయపడుతున్నదే నిజం అవుతున్నదని: మాజీమంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్, 17 జూలై (హి.స.) తెలంగాణ వాదులు భయపడుతున్నదే నిజం అవుతున్నదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఏపీకి దారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ ఏ నీళ్ల కోసమైతే పోరాడారో ఆ నీళ్లను రేవంత్
జగదీష్ రెడ్డి


హైదరాబాద్, 17 జూలై (హి.స.)

తెలంగాణ వాదులు భయపడుతున్నదే నిజం అవుతున్నదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఏపీకి దారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ ఏ నీళ్ల కోసమైతే పోరాడారో ఆ నీళ్లను రేవంత్ రెడ్డి ఏపీకి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. మన నదులు మనకు కాకుండా చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ముందు ఢిల్లీకి వెళ్లేది లేదన్న రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్తో హుటాహుటిన పయణమయ్యాడని విమర్శించారు. హోటల్లో ఉండి రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమార్తో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ మీటింగ్కు సంబంధించి ఓ పత్రిక తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా హెడ్ లైన్ పెట్టిందన్నారు. జలవివాదాలపై కమిటీ అని తెలంగాణలో, గోదావరి-బనకచర్లపై కమిటీ అని ఏపీ ఎడిషన్లో పెట్టారని చెప్పారు. తెలంగాణకు చేస్తున్న ద్రోహమేమిటో తెలుసుకోవడానికి ఇదొక్కటి చాలన్నారు.

'

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande