హైదరాబాద్, 18 జూలై (హి.స.)
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టకు ఎంఎంటీఎస్ విస్తరిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వారు హైదరాబాదులో మాట్లాడుతూ.. ఈ విషయంలో హైదరాబాద్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని రైల్వే శాఖకు ఆదేశాలను జారీ చేశారని పేర్కొన్నారు. పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు ప్రాజెక్టుకు మొదట రూ.330 కోట్లని అనుకున్నామని.. కానీ, బడ్జెట్ పెరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు కొమురవెల్ల మల్లన్న పుణ్యేక్షేత్రంలో కూడా కొత్తగా రైల్వే స్టేషన్కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమి పూజ చేశామని గుర్తు చేశారు. ఆ రైల్వే స్టేషన్ పనులు కూడా పూర్తి కావొస్తున్నాయని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..