బిఆర్ఎస్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టిన క‌విత.. బిసి ఆర్డినెన్స్ సబబేనని ప్ర‌క‌ట‌న
హైదరాబాద్, 17 జూలై (హి.స.) స్థానిక సంస్థల్లో బీసీలకు (BC) 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైందనేనని జనజాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు చెప్పడం తప్పని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిపుణు
MLC కవిత


హైదరాబాద్, 17 జూలై (హి.స.)

స్థానిక సంస్థల్లో బీసీలకు (BC) 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైందనేనని జనజాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు చెప్పడం తప్పని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిపుణులతో చర్చించాకే తాను ఆర్డినెన్స్‌కు మద్దతు ఇచ్చానని అన్నారు. హైద‌రాబాద్ లో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదని.. ఆ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.. బిసి రిజ‌ర్వేష‌న్ ల విష‌యంలో చివరికి బీఆర్ఎస్ వాళ్లు నా దారికి రావాల్సిందేనని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఢిల్లీలో కేంద్ర జలశక్తి నిర్వహించిన మీటింగ్‌లో పాల్గొనడానికి సిగ్గు, పౌరుషం లేదా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్ర‌శ్నించారు.. బనకచర్ల అంశంపై తాము చర్చలకు వెళ్లేది లేదని మొదట సీఎం రేవంత్ మేకపోతు గాభీర్యం చూపారని.. కానీ, దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఢిల్లీకి వెళ్లి ఏపీతో చర్చల్లో పాల్గొన్నారని ఫైర్ అయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande