బావ బావమర్ధులకు చుక్కలు చూపిస్తా : మైనంపల్లి హన్మంతరావు
తెలంగాణ, మెదక్. 17 జూలై (హి.స.) డబ్బులు ఇచ్చి యు ట్యూబ్ లలో తప్పుడు ప్రచారం చేయిస్తున్న బావ భావమర్ధులకు చుక్కలు చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హెచ్చరించారు. గురువారం మెదక్ లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయ
మైనంప‌ల్లి


తెలంగాణ, మెదక్. 17 జూలై (హి.స.)

డబ్బులు ఇచ్చి యు ట్యూబ్

లలో తప్పుడు ప్రచారం చేయిస్తున్న బావ భావమర్ధులకు చుక్కలు చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హెచ్చరించారు.

గురువారం మెదక్ లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడాడు. మేము ప్రజల్లో ఉండి వారి కష్ట సుఖాలు తెలుసుకుంటే BRS నేతలు ఇళ్లల్లో కూర్చొని యు ట్యూబ్ ఛానెళ్లకు డబ్బులు ఇచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని, ఆ పార్టీకి చెందిన నేతలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. బిఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ తగ్గుతున్నదన్న భయంతో సెంటిమెంట్ రాజకీయాలకు కుట్ర చేస్తున్నారని, ప్రాంతం, కులం, మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఎలాంటి కుట్రలు చేసినా కేటీఆర్, హరీష్ రావుతో వారి కుటుంబానికి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. మీడియా పై దాడులు కూడా సహించేది లేదని, మరో సారి మీడియా జోలికి వస్తె ఊరుకునేది లేదన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande