పోలీసుల ఎదుట లొంగిపోయిన జన నాట్యమండలి ఫౌండర్ సంజీవ్
హైదరాబాద్, 17 జూలై (హి.స.) మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అగ్రనేత, జన నాట్యమండలి ఫౌండర్, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సెక్రటేరియట్ మెంబర్ సంజీవ్ అలియాస్ లెంగు దాదా, అతని భార్య స్టేట్ కమిటీ మెంబర్ పెరుగుల పార్వతి అలిగాయాస్ బొంతల పార్వతి అలియాస
మావోయిస్టు


హైదరాబాద్, 17 జూలై (హి.స.)

మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అగ్రనేత, జన నాట్యమండలి ఫౌండర్, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సెక్రటేరియట్ మెంబర్ సంజీవ్ అలియాస్ లెంగు దాదా, అతని భార్య స్టేట్ కమిటీ మెంబర్ పెరుగుల పార్వతి అలిగాయాస్ బొంతల పార్వతి అలియాస్ దీనా ఇవాళ రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. నాలుగు దశాబ్దాల పాటు సీపీఐ మావోయిస్టు పార్టీలో పని చేసిన వీరు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ మావోయిస్టులు కూడా తిరిగి గ్రామాలకు రావాలని పోరు వద్దు.. ఊరు ముద్దు అని వారు పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యాప్రాల్ కు చెందిన సంజీవ్ 1980 లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్ లో చేరారు. దండకారణ్యంలో చైతన్య నాట్య మండలిలో పని చేశారు. వివిధ ప్రజా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గద్దర్ కు ముఖ్య అనుచరుడిగా పని చేశాడు. 2002 లో ఐలాపుర్ లో జరిగిన కాల్పుల్లో తప్పించుకున్నాడు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande