సింగూరు డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి దామోదర‌
తెలంగాణ, సంగారెడ్డి. 17 జూలై (హి.స.) సింగూరు డ్యామ్ నుంచి మంత్రి దామోదర‌ రాజనర్సింహ గురువారం నీటిని విడుదల చేశారు. సింగూరు ఎడమ కాలువ నుంచి సాగు కోసం 100 క్యూసెక్కుల నీటిని మంత్రి నేడు విడుదల చేశారు. రెండు పంటల క్రాప్ హాలిడే తర్వాత ఇప్పుడు నీటిన
మంత్రి దామోదర‌


తెలంగాణ, సంగారెడ్డి. 17 జూలై (హి.స.)

సింగూరు డ్యామ్ నుంచి మంత్రి దామోదర‌ రాజనర్సింహ గురువారం నీటిని విడుదల చేశారు. సింగూరు ఎడమ కాలువ నుంచి సాగు కోసం 100 క్యూసెక్కుల నీటిని మంత్రి నేడు విడుదల చేశారు. రెండు పంటల క్రాప్ హాలిడే తర్వాత ఇప్పుడు నీటిని విడుదల చేయడం జరిగింది. సింగూరు ఎడమ కాలువ మరమ్మతుల నేపథ్యంలో రెండు పంటలకు అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. రైతులు పంట సాగుకు ఇబ్బందుల దృష్ట్యా మంత్రి దామోదర్ రాజనర్సింహ నీటిని విడుదల చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande