తెలంగాణ, సిద్దిపేట.17 జూలై (హి.స.)
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట లోని సురభి వైద్య కళాశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐదు మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. రోజురోజుకు పర్యావరణం కలుషితం అవుతుందని, మొక్కల పెంపకం ద్వారానే నియంత్రించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల చైర్మన్ సురభి హరేందర్రావు, సెక్రటరీ సురభి మహేందర్ రావుతో పాటు వైద్య కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు