తెలంగాణ, ఖమ్మం. 17 జూలై (హి.స.)
పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన అజెండా అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం ఆయన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా, స్థానిక అధికారులు తో కలిసి పెనుబల్లి మండలం పాత కుప్పెనకుంట్ల గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తోందని, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ 500కే గ్యాస్ సిలిండర్, ఉగాది నుండి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 10 లక్షలకు పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు