రాష్ట్రంలో నాణ్యమైన విద్యకు పునాదులు వేస్తున్నాం: మంత్రి వివేక్
తెలంగాణ, మెదక్. 17 జూలై (హి.స.) విద్యా ప్రమాణాలు పెంచడానికి రాష్ట్రంలో నూతనంగా 119 ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఓ ప్రైవేట్ ఫ
మంత్రి వివేక్


తెలంగాణ, మెదక్. 17 జూలై (హి.స.)

విద్యా ప్రమాణాలు పెంచడానికి

రాష్ట్రంలో నూతనంగా 119 ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డు ద్వారానే ప్రభుత్వ పథకాలు అందిస్తామని దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని దాంట్లో భాగంగానే 46 వేల కోట్ల బ్యాంకు లింకేజీ తో పాటు ఐదు వేల కోట్లతో వడ్డీలేని రుణాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వం పదివేల టీచర్లను భర్తీ చేసినట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు ఇస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande