అమరావతి, 17 జూలై (హి.స.)
మచిలీపట్నం (క్రైమ్): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా నేత పేర్ని నాని దిష్టిబొమ్మను తెదేపా కార్యకర్తలు దహనం చేశారు. మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను తగులబెట్టినట్లు తెలిపారు. నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విద్వేషకర వ్యాఖ్యలు చేస్తున్న అతడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోసారి కొల్లు రవీంద్ర గురించి మాట్లాడితే పేర్ని ఇంటి పునాదులు కదిలిస్తామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ