కోవూరు, 17 జూలై (హి.స.)
: నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాని అనే వ్యక్తి బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ