తెలంగాణ, మహబూబ్నగర్. 17 జూలై (హి.స.)
మహబూబ్నగర్ జిల్లా మరికల్ మండలంలోని పసుపుల కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో బుధవారం రాత్రి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా బస చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. పలు పాఠ్యాంశాలపై విద్యార్థులను ప్రశ్నించి విద్యార్థుల నుండి సరైన జవాబు రావడం పట్ల విద్యార్థులను అభినందించారు. కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలిచే విధంగా ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులతో కలిసి గురువారం ఉదయం అల్పాహారాన్ని స్వీకరించారు.
విద్యార్థులు పాఠశాల కార్యదర్శి అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబులు చెప్పడం పట్ల విద్యార్థులను దగ్గర తీసుకొని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు.
ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త్ పట్నాయక్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు