హైదరాబాద్, 17 జూలై (హి.స.)
హరీశ్రావు వాదనలలో పస లేదని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో నిన్న నీటి పారుదల అంశాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు, నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారుల సమావేశంలో ఏ అంశాలపై ఏమి మాట్లాడారో స్వయంగా కేంద్ర మంత్రి సీ.ఆర్ పాటిల్ చెప్పిన కూడా హరీశ్రావు పిచ్చి వాగుడు వాగుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మీటింగ్ లో ఏ ఏ అంశాలు, ఏమి మాట్లాడారో స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా హరీశ్రావు మెదడు కు ఎక్కనట్టు ఉందని ఫైర్ అయ్యారు.
హరీశ్రావు ఆరు అడుగులు పెరిగాడే తప్ప ఆర అంగుళం మెదడు పెంచుకోలేదు.. అడ్డగోలు వాదన అర్థం లేని తర్కంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. సీఎం మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి తన ఉనికిని చాటు కోవాలన్న తపన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్