అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం : వనపర్తి ఎమ్మెల్యే
తెలంగాణ, వనపర్తి. 17 జూలై (హి.స.) పైరవీలకు ఆస్కారం లేకుండా అర్హులైన అడిగి ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి భరోసా కల్పించారు. గురువారం వారు పార్టీ నాయకులతో కలిసి 1,2 వ వార్డులలో మార్నింగ్ వాక్ నిర్వహ
వనపర్తి ఎమ్మెల్యే


తెలంగాణ, వనపర్తి. 17 జూలై (హి.స.)

పైరవీలకు ఆస్కారం లేకుండా అర్హులైన అడిగి ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి భరోసా కల్పించారు. గురువారం వారు పార్టీ నాయకులతో కలిసి 1,2 వ వార్డులలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. వార్డు వాసులతో మాట్లాడారు. వార్డులలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ 18 నెలల ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. కాలనీ వాసుల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో తలెత్తుతున్న సమస్యలను కలెక్టర్ తో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పారిశుధ్య, విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వనపర్తి నియోజకవర్గం పైరవీలకు ఆస్కారం ఇవ్వకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు.ప్రజలు ఇందిరమ్మ రాజ్యపాలన పై సంతృప్తి వ్యక్తం చేశారాని తెలిపారు.రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande