హైడ్రోజన్ పెరాక్సైడ్తో కల్తీపాలు.. పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు
హైదరాబాద్, 18 జూలై (హి.స.) హైదరాబాద్ శివారు బోడుప్పల్ మేడిపల్లి పరిధిలోని పర్వతాపూర్లో కల్తీపాల తయారీ స్థావరం పై ఎస్వోటీ పోలీసులు శుక్రవారం ఉదయం దాడి చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్తో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తిం
కల్తీ పాలు


హైదరాబాద్, 18 జూలై (హి.స.) హైదరాబాద్ శివారు బోడుప్పల్ మేడిపల్లి పరిధిలోని పర్వతాపూర్లో

కల్తీపాల తయారీ స్థావరం పై ఎస్వోటీ పోలీసులు శుక్రవారం ఉదయం దాడి చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్తో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. 110 లీటర్ల కల్తీ పాలు, 1.1 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 19 గ్యాన్ స్కీమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కల్తీపాలు తయారు చేస్తున్న గంగలపూడి మురళీకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్టు ఎస్వోటీ పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande