తెలంగాణ, సూర్యాపేట. 18 జూలై (హి.స.)
సూర్యాపేట నియోజకవర్గం శాసనసభ్యుడు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నేడు తన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారుఈ మేరకు రేవంత్ ట్వీట్ చేశారు.సూర్యాపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు…
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు