హైదరాబాద్, 18 జూలై (హి.స.)
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు రెండో రాజధాని అయిన వరంగల్లో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టీ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 80 శాతం పనులు పూర్తయ్యాయని.. త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వరంగల్ నగరానికి తలమానికంగా టెక్స్టైల్ పార్క్ కూడా రాబోతోందని తెలిపారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ సహా పలు నగరాలను డెవలప్ చేయాలని అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని పాలకులంతా హైదరాబాద్ చుట్టూనే ఫోకస్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీను 20 ఉత్తరాలు రాసినా కూడా కేసీఆర్ వరంగల్ అభివృద్ధికి సహకరించలేదని కామెంట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..