' లెక్క తేల్చండి..ప్రజలను ప్రభుత్వాలను తట్టి లేపే విధంగా వార్త కథనాలు ఉండాలి. హరీష్ రావు
తెలంగాణ, సిద్దిపేట. 18 జూలై (హి.స.) గోదావరి కృష్ణా జలాల లెక్కతేల్చండి.. వాటా ఇచ్చిన తర్వాతనే.. బనకచర్ల నిర్మించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం విలేకరుల పున
హరీష్ రావు


తెలంగాణ, సిద్దిపేట. 18 జూలై (హి.స.)

గోదావరి కృష్ణా జలాల లెక్కతేల్చండి.. వాటా ఇచ్చిన తర్వాతనే.. బనకచర్ల నిర్మించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం విలేకరుల పునఃశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. 1980లో బచావత్ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు నీటి కేటాయింపులు అనుగుణంగా చేశారన్నారు. కేటాయింపులకు తెలంగాణలో ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభ్యంతరం తెలిపినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకొనే పక్షంలో రైటేరియన్ రైట్స్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. దీంతో తెలంగాణ ప్రాంతానికి తీవ్రఅన్యాయం జరుగుతుందన్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా రాసిన లెటర్ వెనక్కి తీసుకోకుండా.. ఆంధ్ర ప్రాంతంలో నీటి కేటాయింపులు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలను ప్రభుత్వాలను తట్టి లేపే విధంగా వార్త కథనాలు ఉండాలని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande