సింహాచలం, 18 జూలై (హి.స.)
, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. కప్ప స్తంభం ఆలింగనం, గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పండితులు వేదాశీర్వచనాలీయగా, పర్యవేక్షణాధికారి జీవీవీఎస్‌కె ప్రసాద్ స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ