మల్నాడు డ్రగ్స్ కేసు.. హైకోర్టులో పబ్ యజమానుల క్వాష్ పిటిషన్
హైదరాబాద్, 18 జూలై (హి.స.) మల్నాడు రెస్టారెంట్పై ఈగల్ టీం ఆకస్మిక దాడులు చేసిన విషయం తెలిసిందే. మొత్తం మూడు పబ్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారంటూ పబ్ యజమానులపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమపై నమోదైన కేసులను కొట్ట
మల్నాడు డ్రగ్స్ కేసు


హైదరాబాద్, 18 జూలై (హి.స.)

మల్నాడు రెస్టారెంట్పై ఈగల్ టీం

ఆకస్మిక దాడులు చేసిన విషయం తెలిసిందే. మొత్తం మూడు పబ్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారంటూ పబ్ యజమానులపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. క్వాక్ పబ్ యజమాని రాజశేఖర్, కోరా పబ్ ఓనర్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్వే పబ్ యజమాని రోహిత్ మాదిశెట్టి తాజాగా రాష్ట్ర అత్యున్న న్యాయస్థానం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిపై కేసులు కొట్టివేయకూడదని, తమ వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య, స్నేహితుడు రాహుల్ తేజ్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande