బాసరలో మంత్రి శ్రీధర్ బాబు తో.. కలెక్టర్, ఎస్పీ భేటి
తెలంగాణ, నిర్మల్. 18 జూలై (హి.స.) బాసర పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును శుక్రవారం ఉదయం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి బాసర ఐఐఐటీ వసతి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలన
శ్రీధర్ బాబు


తెలంగాణ, నిర్మల్. 18 జూలై (హి.స.)

బాసర పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును శుక్రవారం ఉదయం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి బాసర ఐఐఐటీ వసతి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలను అందజేశారు. అనంతరం జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. బాసర మండల కేంద్రంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం బాసర సరస్వతి దేవి అమ్మ వారిని మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande