తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 18 జూలై (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వం దొరల ప్రభుత్వం
కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండల కేంద్రంలో శుక్రవారం ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి హాజరైయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పినపాక నియోజకవర్గాన్ని పాలేరు నియోజకవర్గంతో పాటు అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానన్నారు
పినపాక నియోజకవర్గంలో మరో 1500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని, అలాగే బూర్గంపాడులోని గోదావరి ముంపు ప్రాంతాన్ని మైదాన ప్రాంతానికి తరలించి, ఇందిరమ్మ ఇండ్లు కట్టించి తీరుతామని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు జలాలను బూర్గంపాడు మండలంలోని సాగునీటి అవసరాల నిమిత్తం తరలిస్తామన్నారు. ఇది దొరల ప్రభుత్వం కాదని, ప్రజల ప్రభుత్వమని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు