తెలంగాణ, సిద్దిపేట. 18 జూలై (హి.స.)
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ప్రజాసమస్యలు అడిగి తెలుసుకుని పలు సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కరించాలన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ వాడటం వల్ల ఎదురయ్యే సమస్యల పై అవగాహన కల్పించారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో 2004- 25 సర్వేలో జాతీయ స్థాయిలో హుస్నాబాద్ మున్సిపాలిటీకి 139 వ ర్యాంకు రాష్ట్రస్థాయిలో 150 మున్సిపాలిటీలతో పోటీపడి 9వ ర్యాంకు జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గ్రామగ్రామాన స్టీల్ బ్యాంకు పంపిణీ చేస్తున్నామని, పెళ్లిళ్లు శుభకార్యాలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడవద్దని, స్టీల్ సామాగ్రి వాడాలని సూచించారు. మున్సిపల్ కార్మికులకు కార్యాలయంలో టీ షర్టులు మిఠాయిలు పంపిణీ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు