మంగళగిరి, 18 జూలై (హి.స.)
మంగళగిరి ఎయిమ్స్‌లో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ), నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ)లను గురువారం ప్రారంభించారు. ఇన్ పేషెంట్ బ్లాకులోని మూడో అంతస్థులో ఏర్పాటు చేసిన ఈ కాంప్లెక్సును ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో అహంతెం శాంతాసింగ్ లాంఛనంగా ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో కూడిన పీఐసీయూ, ఎన్‌ఐసీయూ సేవలు పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులు, చిన్నారులకు 24 గంటలూ అత్యవసర వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ