దేశంలోనే పేదలకు .అత్యున్నతమైన వైద్య సేవలు అందించే వైద్య సేవా సంస్థగా స్విమ్స్ ను తీర్చిదిద్దేందుకు టిటిడి కృషి
తిరుపతి, 18 జూలై (హి.స.) :దేశంలోనే పేదలకు అత్యున్నతమైన వైద్యసేవలు అందించే వైద్య సేవా సంస్థగా స్విమ్స్‌ను తీర్చిదిద్దేందుకు టీటీడీ కృషి చేస్తుందని బీఆర్‌నాయుడు తెలిపారు. తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీఎల్‌) రూ.22
దేశంలోనే పేదలకు .అత్యున్నతమైన వైద్య సేవలు అందించే  వైద్య సేవా సంస్థగా స్విమ్స్ ను తీర్చిదిద్దేందుకు టిటిడి కృషి


తిరుపతి, 18 జూలై (హి.స.)

:దేశంలోనే పేదలకు అత్యున్నతమైన వైద్యసేవలు అందించే వైద్య సేవా సంస్థగా స్విమ్స్‌ను తీర్చిదిద్దేందుకు టీటీడీ కృషి చేస్తుందని బీఆర్‌నాయుడు తెలిపారు. తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీఎల్‌) రూ.22.01 కోట్ల విలువైన వైద్య పరికరాలు అందజేసింది. అధునాతన ఎంఆర్‌ఐ స్కానర్‌, 4డీ సీటీ సిమ్యులేటర్‌ సిస్టంలను ఐవోసీఎల్‌ ప్రతినిధులతో కలిసి టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు గురువారం ప్రారంభించారు. ఇప్పటికే ఏటా రూ.140 కోట్లను స్విమ్స్‌ అభివృద్ధికి, రోగులకు మెరుగైన వైద్య సేవలకు టీటీడీ అందిస్తోందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఐవోసీఎల్‌ రూ.14 కోట్ల విలువైన టెస్లా ఎమ్‌ఆర్‌ఐ స్కానర్‌ను, మరో రూ.8 కోట్లతో 4డి సీటీ సిమ్యులేటర్‌ సిస్టంను అందించడం అభినందనీయమన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా స్విమ్స్‌కు ఈ వైద్య పరికరాలను అందించినట్లు ఐవోసీఎల్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ సతీ్‌షకుమార్‌ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande