ఢిల్లీ, 18 జూలై (హి.స.)ఏపీ(Andhra Pradesh)లో మద్యం కుంభకోణం పై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ(YSRCP MP) మిధున్ రెడ్డి(Mithun reddy) ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు(శుక్రవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి పేరును కూడా చేర్చడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
దీంతో మిధున్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో జస్టిస్ పార్ధివాల, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారణ జరపనుంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తనకు సంబంధం లేదని, ఇప్పటికే తనను సిట్ అధికారులు విచారించారని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి