ఇండియన్ నేవీలోకి ‘ఐఎన్ఎస్ నిస్టార్’.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
ఢిల్లీ, 18 జూలై (హి.స.)ఇండియన్ నేవీ (Indian navy) సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి డైవింగ్ సపోర్ట్ వెస్సెల్ ‘ఐఎన్ఎస్ నిస్టార్’ (Ins nistar) శుక్రవారం ఇండియన్ నేవీలో చేరనుంది. ఈ నౌకను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి స
ఇండియన్ నేవీలోకి ‘ఐఎన్ఎస్ నిస్టార్’.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !


ఢిల్లీ, 18 జూలై (హి.స.)ఇండియన్ నేవీ (Indian navy) సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి డైవింగ్ సపోర్ట్ వెస్సెల్ ‘ఐఎన్ఎస్ నిస్టార్’ (Ins nistar) శుక్రవారం ఇండియన్ నేవీలో చేరనుంది. ఈ నౌకను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, ఇతర సీనియర్ ప్రముఖుల సమక్షంలో విశాఖపట్నంలో జల ప్రవేశం చేయనున్నారు. విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) రూపొందించిన ఈ నౌక అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. 80 శాతం స్వదేవీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ నిస్టార్ 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉంటుంది. 10,500 టన్నుల బరువును మోయగలదు. ఇది సముద్రంలో 60 రోజులకు పైగా పనిచేయగలదు. హెలికాప్టర్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంతో పాటు, లోతైన సముద్ర పునరుద్ధరణ కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. .

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande