తాడిపత్రి, 18 జూలై (హి.స.)తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తరవాత టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరవాత కూడా తాడిపత్రిలో ఇరు వర్గాల మధ్య ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
తరచూ తాడిపత్రిలో పెద్దారెడ్డిని అడుగుపెట్టనివ్వనంటూ జేసీ సవాల్ చేస్తుంటే అడుగుపెట్టి తీరతానంటూ పెద్దారెడ్డి సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు తాడిపత్రిలో వైసీపీ రీకాలింగ్ చంద్రబాబు మానిఫెస్టో కార్యక్రమం జరగనుండగా పెద్దారెడ్డి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రిలో కార్యక్రమానికి హాజరవుతానని పెద్దారెడ్డి చెబుతున్నారు. మరోవైపు పెద్దారెడ్డిని రానిచ్చేది లేదని ఇప్పటికే జేపీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో తాడిపత్రి, తిమ్మంపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి